మళ్ళీ తెరపైకి వచ్చిన వర ముళ్ళపూడి

Mullapudi-Venkata-vara
టాలీవుడ్ గర్వించదగ్గ రైటర్స్ లో ఒకరైన స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయి వర ముళ్ళపూడి చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వర ముళ్ళపూడి దర్శకత్వం వహించిన సినిమా ‘విశాఖ ఎక్స్ ప్రెస్’. ఈ సినిమా విమర్శకుల మెప్పు పొందినా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. అంతే కాకుండా వర ముళ్ళపూడి గతంలో ఎన్.టి.ఆర్ తో ‘నా అల్లుడు’ సినిమా చేసాడు. టీవీ మరియు ఫిల్మ్ సర్క్యూట్స్ లో మంచి పేరున్న వర తన తదుపరి సినిమాని మొదలు పెట్టాడు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్, సెకండ్ హ్యాండ్ ఫేం సుదీర్ వర్మ, అలాగే యు ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ విలేజ్ బ్రచ్క్ డ్రాప్ లవ్ స్టొరీని బొబ్బిలి ప్రాంతంలో తెరకెక్కించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కె రాఘవేంద్ర రావు సమర్పణలో నిర్మిస్తున్నారు.

Exit mobile version