‘వారణాసి’ ఆ విషయంలో తొందర పడటం లేదు..?

‘వారణాసి’ ఆ విషయంలో తొందర పడటం లేదు..?

Published on Sep 1, 2026 7:01 AM IST

Varanasi

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ తుది దశకు చేరింది. అయితే, ఈ సినిమా కోసం డిజిటల్ రైట్స్ విషయంలో మేకర్స్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారట. అన్ని భాషల డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ. 150 కోట్లు ఆఫర్ చేయగా, మేకర్స్ అంచనాలకు ఆ మొత్తానికి చాలా తేడా ఉండటంతో ప్రస్తుతానికి ఓటీటీ చర్చలను పక్కన పెట్టారు.

​అంతర్జాతీయ స్టూడియోలతో జరిపిన చర్చలు కూడా ఫలించనప్పటికీ, మేకర్స్ ఎలాంటి ఆర్థిక ఒత్తిడిలో లేరు. మార్కెటింగ్ లో దిట్ట అయిన రాజమౌళి త్వరలోనే అన్ని డీల్స్ సెట్ చేస్తారనే పూర్తి ధీమాతో ఉన్న చిత్ర బృందం, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టింది. భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

తాజా వార్తలు