జూలై 18 న 4 గంటలకి యూట్యూబ్ లో వర్మ

జూలై 18 న 4 గంటలకి యూట్యూబ్ లో వర్మ

Published on Jul 17, 2014 8:00 PM IST

ram-gopal-varma
టెక్నాలజీ ని వెండితెరకి పరిచయం చెయ్యటమంటే తనకి చాలా ఇష్టం .. గతం లో స్టడీ కెమెరా అనే కొత్త విధానాన్ని పరిచయం చేసి నూతన ఒరవడికి నాంది పలికి , 5డి కెమెరా ని ఇండియన్ సినిమాకి పరిచయం చేసి స్మాల్ బడ్జేట్ లో సినిమా తీయచ్చు అని తెలియచెప్పిన దర్శక టెక్నో గా హిస్టరీ లో తనకి ఒక పేజి ఉండేలా రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ లేజెండ్రి డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ..

ఇటీవల తను తీసిన ఐస్ క్రీం సినిమా తో ఫ్లో కెమెరా ని పరిచయం చేసి అసలు బడ్జేట్ లేకుండా ఎలా సినిమా తీయచ్చు అని నిరూపించిన దర్శకుడు రాం గోపాల్ వర్మ .. ఇప్పుడు సినిమా లవర్స్ కోసం మరియు rgv అభిమానులకోసం youtube లో మీట్ అవ్వబోతున్నారు ….

ఈ సందర్భం గా rgv మాటల్లో ‘”మీకు దిల్ రాజు తెలియక పోవచ్చు .. సురేష్ బాబు తెలియక పోవచ్చు..అల్లు అరవింద్ తెలియకపోవచ్చు…అంత పెద్దవాళ్ళని వదిలిప్డితే అసలు మీకు ఇండస్ట్రీ లో స్పాట్ బాయ్ కూడా తెలియకపోవచ్చు..

మీరు కమ్మం లో ఉండచ్చు.. తాడేపల్లి గూడెం లో ఉండచ్చు..అనంతపురం లో ఉండచ్చు..అసలు మీకు హైదరాబాద్ రావటానికి ట్రైన్ టికెట్ కొనటానికి మనీ లేకపోవచ్చు.. అయినా సరే మీరున్న చోటే ఏం ఖర్చు లేకుండా ధియేటర్ లో రిలీజ్ చెయ్యగలిగే ఒక పూర్తి నిడివి గల సినిమా ని ఎలా తీయచ్చో నేను చెబుతాను ఎలా చెయ్యచ్చో మీకు వినటం ఇష్టమైతే రేపు 18 న మధ్యాహ్నం 4 గంటలకి youtube.com/rgv లో చూడండి..” అని అన్నారు ..

రాంగోపాల్ వర్మ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు