‘పవర్ స్టార్’ సినిమా హీరోని పరిచయం చేసిన వర్మ.

‘పవర్ స్టార్’ సినిమా హీరోని పరిచయం చేసిన వర్మ.

Published on Jun 28, 2020 4:30 PM IST

నిన్న నగ్నం మూవీ విడుదల చేసిన వర్మ నేడు ఓ సంచలన మూవీ ప్రకటించారు. పవర్ స్టార్ పేరుతో తెరకెక్కనున్న మూవీలో హీరోని ఆయన పరిచయం చేశాడు. టాలీవుడ్ ఓ టాప్ స్టార్ పోలికలు కలిగిన ఆ నటుడు అచ్చం ఆయనలాగే ఉన్నాడు. ఐతే ఈ మూవీలో హీరోగా నటించడానికి తన అపార్ట్మెంట్ కి వచ్చిన ఈ నటుడుకి ఏ హీరో పోలికలు కలిగిఉంటే అది కేవలం యాధృచ్చికం మాత్రమే అని ఆయన తెలియజేశాడు.

ఏదేమైనా వర్మ మరో కాంట్రవర్సియల్ మూవీకి తెరలేపాడని అర్థం అవుతుంది. ఆయన ఈ మధ్య తెరకెక్కిస్తున్న తక్కువ బడ్జెట్ చిత్రాలు.. బ్యాడ్ టాక్ తెచ్చుకున్నా డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. దీనితో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నిన్న నగ్నం మూవీ విడుదల చేసిన వర్మ మర్డర్, కరోనా వైరస్ చిత్రాలను కూడా విడుదల చేయనున్నాడు.

https://www.instagram.com/p/CB99OjAl5Lz/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు