వర్మకు స్వయంగా సెన్సార్ సర్టిఫికెట్ అందజేసిన పాల్..!

Published on Dec 8, 2019 3:25 pm IST

వర్మ సినిమాలే కాదు ఆయన చర్యలు కూడా ఊహాతీతంగా ఉంటాయి. తనను ద్వేషించే వారిచేత ఇంకా ద్వేషించబడేలా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఆయన తీసిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనేక వివాదాలలో చిక్కుకోవడంతో పాటు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. ఎట్టకేలకు సెన్సార్ రివ్యూ కమిటీ సభ్యులు సెన్సార్ సెర్టిఫికెట్ జారీ చేశారు. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఈనెల 12న విడుదల కానుంది.

ఐతే విడుదలకు లైన్ క్లియర్ కావడంతో వర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తనకు సెన్సార్ సర్టిఫికెట్ ని పాల్ స్వయంగా అందజేస్తున్నట్లు ఒక మార్పింగ్ ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసి, పాల్ ని ఇంకా ఉడికించేస్తున్నారు. మరి ఈ మార్ఫింగ్ ఫోటోపై పాల్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. సిద్దార్థ్ తాతోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More