‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ను ఏపీలో రిలీజ్ చేయరాదు – సుప్రీం కోర్టు

Published on Apr 2, 2019 9:52 pm IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ సినిమాకు వచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నా.. విడుదలైన తెలంగాణ మరియు ఓవర్సీస్ లో మాత్రం ప్రేక్షకులు సినిమా పై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే సుప్రీంకోర్టులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. ఇక ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ను ఏప్రిల్ 3వ తేదీన ఏపీలో రిలీజ్ చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సంబంధిత సమాచారం :