విజయ్ దేవరకొండ తమ్ముడి కోసం బిగిల్ బ్యూటీ

Published on Jan 31, 2020 11:00 pm IST

బిగిల్ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రెండవ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారట. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రంలో వర్ష అచ్చ తెలుగు గుంటూరు అమ్మాయి పాత్ర చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇక వర్ష బొల్లమ్మ నేడు విడుదలైన చూసి చూడంగానే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చింది.

అలాగే వర్ష బొల్లమ్మ ఈనెల ఏడున విడుదల కానున్న జాను చిత్రంలో కూడా ఓ పాత్ర చేస్తున్నారు. జాను తమిళ హిట్ మూవీ 96 కి తెలుగు రీమేక్ కాగా తమిళంలో చేసిన పాత్రనే వర్ష బొల్లమ్మ జాను మూవీలో చేస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ కెరీర్ ని బాగానే నడిపిస్తుంది. జాను మూవీతో పాటు ఆనంద్ దేవరకొండ సినిమాతో ఈ అమ్మడుకి తెలుగులో కూడా మంచి గుర్తింపు రావడం ఖాయం.

సంబంధిత సమాచారం :