ఇంట్రస్టింగ్ టైటిల్ తో రీఎంట్రీ ఇస్తోన్న హీరో !

Published on May 1, 2021 8:00 pm IST

`హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం` లాంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ సందేశ్‌ ఆ తర్వాత `ఏమైంది ఈ వేళా` లాంటి హిట్ అందుకున్నాడు. అయితే మళ్ళీ చాల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. పైగా ఆ ఎంట్రీ అదిరిపోయేలా ఉంటుందని చెబుతున్నాడు వరుణ్‌. ఈ మేరకు కమెడీయన్‌ ధన్‌రాజ్‌తో ఆయన ఓ స్పెషల్‌ వీడియోని రూపొందించారు.

ఈ వీడియోలో తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నెక్ట్స్ తాను `ఇందువదన` సినిమా చేయబోతున్నాడట. చిత్ర ఫస్ట్ లుక్‌ అదిరిపోతుందని, ఊహించని విధంగా ఉంటుందట. మొత్తానికి వరుణ్‌ సందేశ్‌ నుండి ఇంట్రస్టింగ్ సినిమా రానుంది. కాగా మరో రెండు రోజుల్లో ఫస్ట్ లుక్‌ రాబోతుందట. మరి ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి నూతన దర్శకుడు ‘ఎంఎస్‌ఆర్‌’ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. టైటిలే ఆసక్తిగా ఉండటంతో సినిమా పై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :