కొత్త దర్శకుడితో వరుణ్ సందేశ్ మరో చిత్రం

కొత్త దర్శకుడితో వరుణ్ సందేశ్ మరో చిత్రం

Published on Nov 30, 2011 10:39 AM IST

Priyudu 6
మరో రచయిత దర్శకుడిగా మారబోతున్నాడు. అసాధ్యుడు, మిస్టర్ ఎర్రబాబు వంటి పలు చిత్రాలకు సంభాషణలు అందించిన నంద్యాల రవి దర్శకుడి అవతారం ఎత్తనున్నాడు. కుమార్ బ్రదర్స్ బ్యానర్ పై డి. సురేష్ నిర్మించబోయే ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుంది.

వరుణ్ సందేశ్ నటించిన రొమాంటిక్ చిత్రం ‘ప్రియుడు’ డిసెంబరు 3న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం వరుణ్ నీలకంఠ దర్శకత్వంలో ‘చమ్మక్ చల్లో’ అనే చిత్రం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు