వరుణ్ తేజ్ కొత్త సినిమాను వెతుకున్నాడా ?

Published on May 20, 2021 12:02 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా సినిమాకు మధ్యన వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నారు. ఒకసారి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తే ఇంకోసారి లవ్ స్టోరీ ఆతర్వాత యాక్షన్ సినిమా చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ కాగా ఇంకొకటి శశి కిరణ్ తెరకెక్కిస్తున్న ‘గని’. ఈ రెండూ భిన్నమైన సినిమాలే. ఈ రెండూ కూడ షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటంతో రెండింటికీ తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఈ ఖాళీ సమయంలో కొత్త ప్రాజెక్ట్ ఒకటి చూసుకున్నాడట తేజ్. ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు వరుణ్ కు కథను వినిపించారని, అది నచ్చి తేజ్ ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని చెప్పినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రవీణ్ సత్తారు ఇటీవలే నాగార్జున హీరోగా ఒక సినిమాను లాంఛ్ చేశారు. జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా పూర్తయ్యేసరికి వరుణ్ తేజ్ చేస్తున్న రెండు సినిమాలు కంప్లీట్ అవుతాయి. ఆతర్వాత వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :