లండన్ షెడ్యూల్ పూర్తి చేసిన వరుణ్ తేజ్ !
Published on Oct 25, 2017 8:25 am IST

ఇటీవలే ‘ఫిదా’ సినిమాతో బంపర్ హిట్ అందుకుని కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదుచేసుకున్న మెగాహీరో వరుణ్ తేజ్ తన తర్వాతి చిత్రం కూడా ‘ఫిదా’ లానే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. హైదరాబాద్లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిన్నటి వరకు లండన్లో చిత్రీకరణ జరుపుకుంది.

షెడ్యూల్ ముగించుకున్న వరుణ్ తేజ్ ఈరోజు ఉదయమే హైదరాబాద్ తిరిగిచ్చారు. సుమారు నెల రోజుల పైగానే జరిగిన ఈ షెడ్యూల్లో రాశీ ఖన్నా, వరుణ్ తేజ్ లపై పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ‘తొలిప్రేమ’ యొక్క టైటిల్ ను దాదాపుగా ఖరారు చేశారనే అంటున్నారు. ఇకపోతే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook