తాజా షెడ్యూల్ కి సిద్దమవుతున్న వరుణ్ తేజ్ టీం

తాజా షెడ్యూల్ కి సిద్దమవుతున్న వరుణ్ తేజ్ టీం

Published on Jul 25, 2014 5:00 AM IST

Varun-Tej

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం కానున్న మరో హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మొదటి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గత నెల వరకూ గోదావరి ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. కొద్ది రోజులుగా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన ఈ చిత్ర టీం ఈ నెల 29నుంచి తాజా షెడ్యూల్ ని మొదలు పెట్టనుంది.

హైదరాబాద్ లో ప్రారంభమయ్యే ఈ షార్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఆగష్టు 5న మరో షెడ్యూల్ ని గోదావరిలో ప్రారంభించనున్నారు. ఆ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక మిగిలి ఉన్న 3 పాటలను షూట్ చేయనున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ‘గొల్లభామ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఈ చిత్ర టీం మాత్రం ఈ టైటిల్ ని ఇంకా ఖరారు చేయలేదు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు