పూర్తిగా కోలుకున్న మెగాహీరో, షూట్‌కు రెడీ!

21st, November 2016 - 01:05:17 PM

varun-tej
యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టి ఆ రెండు సినిమాలనూ ఒకేసారి పూర్తి చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. నెలన్నర క్రితం ఈ రెండు సినిమాల్లో ఒకటైన ‘మిస్టర్’ షూటింగ్‌లో గాయపడ్డప్పటి నుంచీ వరుణ్ తేజ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓ ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ కాలుకి ఫ్రాక్చర్ అవ్వడంతో వరుణ్ అప్పట్నుంచీ 50 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆయన, తాజాగా నేటినుంచి ‘మిస్టర్’ సెట్స్‌లో జాయిన్ అయిపోయారు.

50 రోజుల తర్వాత ఇవ్వాళే షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టానని, గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఇక వరుణ్ తేజ్‌కు గాయం అవ్వడంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ‘ఫిదా’ రెండూ కొన్నాళ్ళుగా షూట్‌కు బ్రేక్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలనూ ఇప్పుడు శరవేగంగా పూర్తి చేయాలని వరుణ్ తేజ్ ప్లాన్ చేస్తున్నారు.