33 రోజుల సుధీర్గ షెడ్యూల్ అనంతరం ‘గొల్లభామ’ యూనిట్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. పూజా హెడ్గే హీరోయిన్.మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నెల రోజుల పాటు హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను అమలాపురం, యానాం, కాకినాడ తదితర ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తో దాదాపు చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. వరుణ్ తేజ్’కు ఇది తోలి సినిమా. ఇన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఎప్పుడూ గడపలేదు. ఈ షెడ్యూల్ ఎప్పుడు పూర్తవుతుందని వరుణ్ వెయిట్ చేస్తూ వచ్చాడు. ఫ్యామిలిని చాలా మిస్ అవుతున్నాను, త్వరలో షెడ్యూల్ పూర్తవుతుంది అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నేటితో షూటింగ్ కంప్లీట్ కావడంతో హైదరాబాద్ తిరిగోస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించాడు. షూటింగ్ బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు


