వరుణ్ తేజ్ ఆ దర్శకుడికి ఓకే చెప్పాడు !
Published on Mar 5, 2018 5:52 pm IST

తొలిప్రేమ సినిమా తరువాత వరుణ్ తేజ్ రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. సంకల్ప్ దర్శకత్వంలో స్పేస్ సినిమా ఒకటి సాగర్ చంద్ర సినిమా మరొకటి. సంకల్ప్ సినిమా అందరికి తెలుసు. తాజాగా వరుణ్ తేజ్ డైరెక్టర్ సాగర్ చంద్ర సబ్జెక్టు ను ఓకె చేసాడు. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. స్క్రిప్ట్ ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

సాగర్ చంద్ర గతంలో అయ్యారే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. మూడో సినిమా వరుణ్ తేజ్ తో చెయ్యడం విశేషం. ఈ సినిమాకు సంభందించిన నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ప్రాజెక్ట్ ను ఆఫిషియల్ గా అనౌన్స్ చెయ్యనున్నారు చిత్ర యూనిట్.

 
Like us on Facebook