తన కోవిడ్ రిపోర్ట్ పై వరుణ్ తేజ్ ఫన్నీ పోస్ట్.!

తన కోవిడ్ రిపోర్ట్ పై వరుణ్ తేజ్ ఫన్నీ పోస్ట్.!

Published on Jan 7, 2021 12:00 PM IST

Varun tej

గత కొన్ని రోజుల కితమే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని స్వయంగా తెలపగా అతను త్వరగా కోలుకోవాలని అంతా కోరుకున్నారు. మరి అది అలా ఉండగానే ఇంకొన్ని గంటల్లోనే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని వెల్లడించాడు. అయితే చరణ్ కు లక్షణాలు ఏమీ లేవు కానీ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపాడు.

కానీ వరుణ్ కు మాత్రం లక్షణాలు ఉన్నట్టుగా తెలిపాడు. మరి ఇన్ని రోజులూ క్వారంటైన్ లో ఉన్న తేజ్ ఫైనల్ గా తనకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ఫన్నీగా షేర్ చేసుకున్నాడు. “నేనెప్పుడూ ఓ నెగిటివ్ రిపోర్ట్ నాకు ఇంత ఆనందం ఇస్తుందని అనుకోలేదు” అని ఫైనల్ గా తనకి కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు