వరుణ్ తేజ్ ని ‘లోఫర్’ గా మార్చిన పూరి
Published on Jun 21, 2015 2:32 pm IST

varun-tej-puri

సినిమా సినిమాకి మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే కాకుండా, శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేయగల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘జ్యోతిలక్ష్మీ’ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సినిమాని వేగంగా తీయడమే కాదు డిఫరెంట్ టైటిల్స్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోగల టాలెంట్ ఉన్న దర్శకుడు పూరి. గతంలో ఇడియట్, పోకిరి, దేశముదురు లాంటి డిఫరెంట్ టైటిల్ పెట్టన పూరి వరుణ్ తేజ్ కోసం కూడా ఇలాంటి టైటిల్ ని ఫిక్స్ చేసారు.

తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ వరుణ్ తేజ్ సినిమాకి ‘లోఫర్’ అనే టైటిల్ ని ఖరారు చేసాడు. అప్పుడే ఈ లోఫర్ అనే టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ద్వారా పూరి బాలీవుడ్ న్యూ కమర్ అయిన దిశా పటానిని హీరోయిన్ గా పరిచయం చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పూరి జగన్నాధ్ ఈ సినిమాని ఆగష్టు కల్లా పూర్తి చేసి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ లో మొదలు పెడతాడు.

 
Like us on Facebook