డేట్ లాక్ చేసిన వరుణ్ తేజ్ బాక్సింగ్ చిత్రం “గని”.!

డేట్ లాక్ చేసిన వరుణ్ తేజ్ బాక్సింగ్ చిత్రం “గని”.!

Published on Jan 28, 2021 12:07 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనదైన సినిమాల ఎంపికతో తెలుగు సినిమాను ఎప్పుడూ మంచి సినిమాలను అందించే ప్రయత్నాన్ని చేస్తూ వస్తున్నాడు. ఇతర హీరోలతో పోలిస్తే రొటీన్ సినిమాలను కాకుండా కాస్త కొత్తగా ఉండే కథలను ఎంచుకొని మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్నాడు. మరి అలా తాను లేటెస్ట్ గా చేపట్టిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “గని”.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో కిరణ్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రం నుంచి ఇటీవలే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రానికి మేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. వచ్చే జూలై 30 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు.

మరి ఈ చిత్రంలో వెర్సిటైల్ నటుడు ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తుండగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ మరియు సిద్దూ ముద్దా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు