ఫైనల్ రౌండ్ లో వరుణ్ తేజ్ “గని”.!

Published on Jul 10, 2021 2:00 pm IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. మొదటి నుంచి కూడా స్క్రిప్ట్ సెలక్షన్ లో మంచి టేస్ట్ చూపిస్తూ వస్తున్న వరుణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “గని”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం ఆడియెన్స్ బాగానే ఎదురు చూస్తున్నారు.

అలాగే ఈ సినిమా కోసం స్టన్నింగ్ మేకోవర్ లోకి మారిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఫైనల్ రౌండ్ లోకి అడుగు పెట్టినట్టుగా తెలిపారు. గత కొంత కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకున్నట్టుగా మేకర్స్ ఈరోజు కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ చిత్రంలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్దా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :