బాక్సర్ గా మెగా హీరో అదుర్స్..!

Published on Jan 19, 2020 9:34 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ బాక్సర్. నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంధర్భంగా బాక్సర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాగా పెరిగిన గడ్డం, తలకు నిట్ క్యాప్ ధరించి పంచింగ్ బ్యాగ్ పై చెమటలు చిందేలా ప్రాక్టీస్ చేస్తున్న వరుణ్ లుక్ కేక అని చెప్పాలి. కండలు తిరిగిన శరీరంతో బాక్సర్ గెటప్ లో వరుణ్ ప్రొఫెషనల్ గా ఉన్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఇటీవలే అధికారికంగా మొదలైన ఈ చిత్రం, రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న వరుణ్ గత ఏడాది గద్దలకొండ గణేష్ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న మాస్ రోల్ చేసి మెప్పించారు.

సంబంధిత సమాచారం :

X
More