మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం గత కొంతకాలంగా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమా విడుదలపై క్లారిటీ రావడంతో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే స్టార్ కమెడియన్ సత్య ఈ చిత్రంలో ఒక కీలకమైన కామెడీ రోల్‌లో నవ్వులు పూయించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి స్టార్ కంపోజర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.



