వరుణ్ తేజ్ చేతుల మీదుగా రేపే “101 జిల్లాల అందగాడు” ట్రైలర్ విడుదల!

Published on Aug 23, 2021 8:01 pm IST

శ్రీనివాస్ అవసరాల హీరోగా, రూహని శర్మ హీరోయిన్ గా రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ డ్రామా నూటొక్క జిల్లాల అందగాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 25 వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం లో అవసరాల శ్రీనివాస్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు సినిమా పై ఆసక్తి నెలకొనే విధంగా ఉన్నాయి. ఈ సినిమా మేకర్స్ సైతం చాలా మంచి కథ అంటూ ప్రమోట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :