వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఎక్కువుగా బి,సి సెంటర్స్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఎక్కువుగా ఆకట్టుకుంది. దాంతో మొదటి వారం ‘గద్దలకొండ గణేష్’ మంచి కలెక్షన్స్ సాధించాడు. అయితే రెండో వారంలో మాత్రం ‘గద్దలకొండ గణేష్’కి కలెక్షన్లు తగ్గాయి.
కాగా ఈ చిత్రం 14వ రోజు పూర్తయ్యే సరికి తెలంగాణ, ఆంధ్రాలో రూ.21 కోట్ల మార్కును, ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మార్కును దాటేసింది. గత పద్నాలుగు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం 7.76 కోట్లు,
సీడెడె 3.41 కోట్లు,
తూర్పు గోదావరి 1.67 కోట్లు,
పశ్చిమ గోదావరి 1.40 కోట్లు,
గుంటూరు. 1.8 కోట్లు,
కృష్ణా 1.4 కోట్లు,
నెల్లూరు. 82 లక్షలు
మొత్తంగా ‘గద్దలకొండ గణేష్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.37.65 కోట్ల గ్రాస్, రూ.24.01 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.24.25 కోట్ల మేర జరిగింది. అయితే 25 కోట్ల రూపాయాలతో బరిలోకి దిగిన గద్దలకొండ గణేష్ లాభాల్లోకి రావాలంటే.. మరో 1 కోటి రూపాయలు వసూలు చేయాల్సిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి ‘గద్దలకొండ గణేష్’ లాభాల్లోకి వస్తాడో రాడో చూడాలి.


