వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ పూర్తవ్వబోతుంది !
Published on Sep 5, 2018 9:55 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుందని తెలుస్తోంది. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తవడానికి కేవలం ఒక్క షెడ్యూల్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉందట.

ఈ నెల 20న మొదలు కానున్న ఈ షెడ్యూల్‌ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా జరుపుకుంటుంది, లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వరుణ్ ఈ చిత్రంతో పాటు అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ తో కలిసి ‘ఎఫ్ 2’అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.

  • 9
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook