రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన గని..!

Published on Aug 5, 2021 6:56 pm IST

వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, ఉపేంద్ర, లహరి శరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ను వచ్చే దీపావళి పండుగ కి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.

అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లు, విడుదల లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించడం జరుగుతోంది. అయితే వరుణ్ తేజ్ చిత్రం విడుదల తేదీ ను ప్రకటించడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :