​‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్‌ను ఆవిష్కరించిన దర్శకుడు అజయ్ భూపతి

​‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్‌ను ఆవిష్కరించిన దర్శకుడు అజయ్ భూపతి

Published on Jul 9, 2026 8:00 AM IST

​మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన ఈ సినిమా జూలై 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ‘రిలీజ్ ట్రైలర్’ను దర్శకుడు అజయ్ భూపతి ఆవిష్కరించారు. ట్రైలర్ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని పేర్కొన్న ఆయన, చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

​దేవుడి అస్తిత్వం, యాక్షన్ నేపథ్య డైలాగులతో సాగిన ఈ ట్రైలర్‌కు మణిశర్మ సంగీతం అందించగా, ‘పార్కింగ్’ చిత్ర ఫేమ్ జిజ్జు సన్నీ కెమెరామెన్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ లభించింది. కుటుంబ సమేతంగా చూసేలా సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. జాన్ విజయ్, మైమ్ గోపి, రాజీవ్ కనకాల, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 10న థియేటర్లలోకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు