గ్యాప్ లేకుండా షూట్ చేస్తోన్న “రాఘవయ్య” !

Published on Feb 8, 2021 11:29 am IST

సునీల్ ‘అందాలరాముడి’తో కథానాయకుడిగా మారి మొదటి సినిమాతోనే విజయం అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో మర్యాద రామన్న చేసి, ఆ ఊపులో కమెడియన్ వేషాలకు స్వస్తి పలికి హీరోగా మారి వరుస పెట్టి సినిమాలు చేసాడు. అయితే సక్సెస్ ని కొనసాగించలేక , హాస్య పాత్రలో కనువిందు చేస్తున్నాడు. అయితే మరల ఇప్పుడు రెండేళ్ల తర్వాత “వేదాంతం రాఘవయ్య” తో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాగా ఈ సినిమాకు సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట‌, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాకు క‌థ‌ అందించ‌డంతో పాటు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అసలు షెడ్యూల్స్ మధ్య గ్యాప్ కూడా లేకుండా షూట్ చేస్తున్నారట. ఆదివారాలు కూడా షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :