యువ హీరోలు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు కలిసి నూతన దర్శకుడు ఇంద్రసేనా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వీరభోగ వసంతరాయులు’. సీనియర్ హీరోయిన్ శ్రీయా శరన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలకానుంది. ఇక శ్రీవిష్ణు ఈ చిత్రంలో గ్రహాంతర వాసిగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదల అయినా ఈ చిత్రం యొక్క టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ పతాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం తో బాక్సాఫిస్ వద్ద పోటీపడనుంది.


