వెన్నిస్ పై పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published on May 16, 2021 10:12 pm IST

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ భాగంగా ఈ రోజు ‘వెన్నిస్’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లోనే.. ‘ఈ ప్ర‌పంచంలోనే అంద‌మైన న‌గ‌రాల్లో ‘వెన్నిస్’ నగరం కూడా ఒక‌టి. ఇది ఇట‌లీ నార్త్ ఈస్ట్ సిటీ. ఈ సిటీలో కార్లు, బైకులు లాంటివి ఉండ‌వు. ఓ హౌస్ నుంచి మ‌రో హౌస్ కి వెళ్లాలంటే గండోలా అనే అంద‌మైన‌ ప‌డ‌వ వేసుకుని వెళ్లాల్సిందే. ఈ ప్ర‌పంచంలోనే మొద‌టి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన అమ్మాయి కూడా ఈ సిటీ అమ్మాయే.

ఈ న‌గ‌రంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ్యూజిషియ‌న్స్ ఏదో ఒక వాయిద్యం వాయిస్తూ కనిపించడం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నేను వెన్నిస్ వెళ్లిన‌ప్పుడు హాలీవుడ్ న‌టి ‘ఎంజెలీనా జోలి’ అప్పుడే అక్క‌డ ఓ హోట‌ల్ లో ఉండి వెళ్ళింది అని తెలిసింది. నేను ఆ హోట‌ల్ కి వెళ్ళి షూటింగ్ చేయాలి, అబ‌ద్దం చెప్పి, ఎంజెలీనా ఉండి వెళ్లిన రూమ్ లో ఆమె ప‌డుకున్న బెడ్‌ పై కాసేపు కూర్చున్నాను. అదో శాటిస్పాక్ష‌న్‌. వెన్నిస్ న‌గ‌రం రోజు రోజుకీ మున‌గిపోతుంద‌ని, 2030నాటికి ఈ న‌గ‌రం స‌గం మునిగిపోయి ఘోస్ట్ సిటీ అవుతుంద‌ని చెబుతున్నారు. అది నిజ‌మో కాదో తెలియ‌దు. వీలైతే వెన్నిస్‌ను ఓసారి చూడండి. ఈ భూమి పై అంద‌మైన న‌గ‌రం అది’’ అని పూరి వెన్నిస్ గురించి తెలియజేశాడు.

సంబంధిత సమాచారం :