ట్రైలర్ రిలీజుకు సిద్దమైన ‘వెంకటాపురం’ !

8th, February 2017 - 09:44:04 PM


‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘వెంటాపురం’. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇకపోతే చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు రాహుల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇకపోతే గుడ్ సినిమాస్ పతాకంపై తుము ఫణికుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు వేణు మడికంటి డైరెక్ట్ చేస్తుండగా రాహుల్ సరసన మహిమ మక్వాన హీరోయిన్ గా నటించింది. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించగా అచ్చు సంగీత దర్శకత్వం వహించారు. నటుడు రాహుల్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుని మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు.