మలయాళ ‘దృశ్యం-3’.. వెంకటేష్ భలే తప్పించుకున్నాడుగా..!

మలయాళ ‘దృశ్యం-3’.. వెంకటేష్ భలే తప్పించుకున్నాడుగా..!

Published on May 21, 2026 5:55 PM IST

మలయాళంలో భారీ అంచనాలతో విడుదలై, ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’ చిత్రానికి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ సినిమాకు వస్తున్న రివ్యూస్ చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. కథలో చాలా ల్యాగ్ ఉందని, ప్రేక్షకుడిని మెప్పించే బలమైన ట్విస్టులు లేకపోవడంతో సినిమా బోర్ కొట్టిస్తోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఈ టాక్ చూశాక టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నిజంగానే ఒక గ్రేట్ ఎస్కేప్ అయ్యారని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

నిజానికి ‘దృశ్యం 3’ తెలుగు రీమేక్‌లో నటించేందుకు వెంకటేష్ దాదాపు సైన్ చేశాడు. చర్చలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే, తనకున్న ఇతర తెలుగు ప్రాజెక్టుల కమిట్‌మెంట్స్ కారణంగా ఆయన చివరి నిమిషంలో ఈ సీక్వెల్ నుండి తప్పుకున్నాడు. ఆ ప్లేస్‌లో చిరంజీవి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు డేట్స్ కేటాయించారు. కట్ చేస్తే, ఇప్పుడు ‘దృశ్యం 3’ పూర్ టాక్‌తో మొదలైంది.

ప్రస్తుతం వెంకటేష్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా భారీ అంచనాలు క్రియేట్ చేసిన ‘దృశ్యం-3’ ఇలా నెగిటివ్ స్టార్ట్ తెచ్చుకోవడంతో వెంకీ ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు