భారీ పోరాటానికి సిద్దమవుతున్న వెంకీ

Published on Jan 27, 2021 4:00 am IST

విక్టరీ వెంకటేష్ ఎంతో ఇష్టపడి చేస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఆసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ఎంతో సహజంగా అనిపించడంతో వెంకటేష్ రీమేక్ చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నారు. eఈమధ్య కాలంలో ఏ సినిమాకూ పెట్టనంత హార్డ్ వర్క్ ఈ సినిమా కోసం పెడుతున్నారు. ప్రతి విషయం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఒరిజినల్ వెర్షన్లో చేయలేకపోయిన కొన్ని అంశాలను రీమేక్లో చేస్తున్నారట.

ముఖ్యంగా పోరాట సన్నివేశాల విషయంలో పీటర్ హెయిన్ ‘అసురన్’లో చేయలేకపోయిన కొన్ని కొత్త తరహా మూమెంట్స్ ‘నారప్ప’లో వెంకీ చేత చేయిస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక పాట, క్లైమాక్స్ ఫైట్ మాత్రమే మిగిలున్నాయట. ఈ నెలాఖరులోపు వాటిని కూడ కంప్లీట్ చేయనున్నారు టీమ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తోంది. ఈ వేసవికి
సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :