‘వెంకీ’కి స్టార్ డమ్ తెచ్చిన సినిమా హిందీలోకి.. !

Published on Mar 11, 2019 12:20 pm IST

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వెంకీకి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో కూలి నెంబర్ 1 ముందువరుసలో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీలోకి రీమేక్ అవ్వబోతుంది. 1991లో విడుదలైన కూలీ నెంబర్ 1లోని కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. పైగా ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.

కాగా ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ పోషించిన రోల్ ను హిందీలో వరుణ్ ధావన్ చేస్తున్నాడు. అలాగే వెంకీ సరసన హీరోయిన్ గా నటించిన టబు పాత్రను హిందీలో సారా ఆలీఖాన్ పోషిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :