మళయాళ సూపర్ హిట్ సినిమాలో నటించనున్న వెంకటేష్

Published on Jan 8, 2014 11:00 am IST

victory-venkatesh
విక్టరీ వెంకటేష్ త్వరలోనే మళయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాని వైడ్ యాంగిల్ ఫిల్మ్స్ సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. విలక్షణ దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమా మలయాళంలో విజయం సాదించిన ‘దృశ్యం’ సినిమాని స్పూర్తిగా తీసుకొని చేస్తున్నారు. మోహన్ లాల్ – మీన జంటగా నటించిన ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల మెప్పును కూడా పొందింది. బాగా టఫ్ స్క్రీన్ ప్లే తో డ్రామా థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

సంబంధిత సమాచారం :