వెంకటేష్ లుక్ ఫాన్స్ ను ఖుషి చేస్తోంది !
Published on Mar 9, 2018 11:01 am IST

తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తోన్న సినిమా ఆటా నాదే వేటా నాదే. ఈ చిత్ర షూటింగ్ వచ్చేవారం హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. అనుప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సురేష్ బాబు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫెసర్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేష్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఫాన్స్ వెంకటేష్ లుక్ చూసి ఖుషి అయిపోతున్నారు. లుక్ ను అధికారికంగా విడుదల చెయ్యకపోయినా ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ లో వెంకటేష్ లుక్ వైరల్ అయ్యింది. తేజ సినిమాకోసం వెంకటేష్ ఫోటో షూట్ లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటో అది. శ్రియ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నారా రోహిత్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

 
Like us on Facebook