మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేష్.

Published on Jun 3, 2019 11:50 am IST

తెలుగు ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ అనువాదాలపై ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. కెరీర్ ప్రారంభంలోనే వెంకటేష్ ఇతర భాషా అనువాదాలలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. రీసెంట్ గా ఆయన బాడీగార్డ్,దృశ్యం, గురు వంటి అనువాదాలలో నటించి అలరించారు. తాజాగా వెంకటేష్ మరో రీమేక్ మూవీ ని తెలుగులో చేయడానికి సుముఖంగా ఉన్నారంట. హిందీలో ఇటీవల విడుదలైన “దే దే ప్యార్ దే” మూవీ ని తెలుగులో వెంకటేష్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు అన్న నిర్మాత సురేష్ బాబు తో చెప్పగా, ‘దే దే ప్యార్ దే” మూవీ నిర్మాతలతో ఆయన చర్చించనున్నారట.

అజయ్ దేవగణ్, రకుల్,టబు నటించిన ఈ మూవీ హిందీలో విజయం సాధించింది. భార్యను వదిలేసి యంగ్ లేడీ ప్రేమలో పడ్డ మిడిల్ ఏజ్ మెన్ గా అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో నటించడం జరిగింది. వెంకటేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More