రాంబాబుగా సిద్దమవుతున్న వెంకటేష్

రాంబాబుగా సిద్దమవుతున్న వెంకటేష్

Published on Jul 2, 2014 11:19 AM IST

venkatesh

విక్టరీ వెంకటేష్ మరోసారి తన ట్రేడ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే ‘దృశ్యం’. ఇందులో ఫ్యామిలీ డ్రామాతో పాటు సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా కలిపి ఆడియన్స్ ని థ్రిల్ కి గురిచేయనున్నారు.

‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్ రాంబాబు పాత్రలో, తన ఫ్యామిలీని ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ మాన్ గా కనిపించనున్నాడు. సాఫీగా సాగిపోయే రాంబాబు లైఫ్ లో తను ఇష్టపడే ఫ్యామిలీ కోసం ఫైట్ చేయాలనుకున్నప్పుడు తన లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఇందులో
చూపించనున్నారు.

శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’ సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సురేష్ బాబు – రాజ్ కుమార్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని వెంకటేష్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

తాజా వార్తలు