టైమ్ కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్

Published on Jun 16, 2021 8:13 pm IST

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎంతో ముచ్చటపడి చేస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ ‘అసురన్’ చూసిన వెంటనే రీమేక్ చేయాలని నిర్ణయ్టించుకున్న వెంకీ హక్కుల్ని కొనేసి శ్రీకాంత్ అడ్డాలను రంగంలోకి దింపి ఆలస్యం లేకుండా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ చిత్రం కోసం ఆయన చాలానే కష్టపడ్డాడు. మేకోవర్ దగ్గర్నుండి సన్నివేశాల్లో పెర్ఫార్మెన్స్ వరకు అన్నింటిలోనూ పెర్ఫెక్షన్ కోసం చాలానే కష్టపడ్డారు. చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలా అని ఆతురతగా ఉండేవారు.

కానీ సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి అనుకునేలోపు లాక్ డౌన్ పడటంతో షూటింగ్ నిలిచిపోయింది, విడుదల వాయిదాపడింది. జూన్ నెలాఖరుకు రెండు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకునే ఆస్కారం ఉండటంతో వెంకీ టీమ్ పనులు ప్రారంభించారట. మిగిలిఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా ముగించి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని చూస్తున్నారట. అంతేకాదు జూన్ నెలాఖరుకు 50 శాతం ఆక్యుపెన్సీకి వస్తే అది జూలై నెలకి 100 శాతంగా మారే అవకాశం ఉంది. అందుకే అన్నీ కుదిరితే జూలై నెలలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం :