వెంకీ రెండు సినిమాల్ని ఒకేసారి చేస్తారా ?

వెంకీ రెండు సినిమాల్ని ఒకేసారి చేస్తారా ?

Published on May 26, 2018 12:05 PM IST

చివరిగా ‘గురు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లాంగ్ గ్యాప్ తరవాత రెండు సినిమాలకు సైన్ చేశారు. ఆ రెండు చిత్రాలు మల్టీ స్టారర్లే కావడం విశేషం. వీటిలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న ‘ఎఫ్ 2’ సినిమా ఒకటి. ఇందులో వెంకీతో పాటు యువ హీరో వరుణ్ తేజ్ నటించనున్నాడు.

ఇక రెండవ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో వెంకీతో పాటు నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకేసారి జూన్ నెలలో మొదలవుతాయట. రెండు చిత్రాల షూటింగ్లో వెంకీ ఒకేసారి పాల్గొంటారని వినికిడి. ఈ వార్త ఎంత మేరకు వాస్తవమో తెలియాలంటే రెండు చిత్ర బృందాల నుండి రెగ్యులర్ షూట్ మొదలయ్యే తేదీలు అధికారికంగా ప్రకటితమయ్యే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు