విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా ఈ నెల 22 నుండి షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐతే, ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం వెంకటేష్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్‌తో పాటు వెంకీ డ్రెసింగ్ స్టైల్ కూడా మారుస్తున్నారట. మొత్తానికి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారని.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది.
పైగా ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. కాగా ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్.


