వెంకటేష్, తేజ సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !

తేజ దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుండి హైదరాబాద్ ఓల్డ్ సిటిలోప్రారంభంకానుంది. అనూప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే నటిస్తున్నారు.

‘గురు’ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తేజ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ తరువాత తేజ చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. ‘ఆటా నాదే వేటా నాదే’ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉంది. త్వరలో చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.