
టాలీవుడ్ లో విక్టరీకి కేరాఫ్ అడ్రస్ గా మారి అదే తన ట్యాగ్ లైన్ గా మార్చుకొని తెలుగు ప్రేక్షకులను 25 ఏళ్ళుగా ఎంటర్టైన్ చేస్తున్న హీరో వెంకటేష్. కామెడీ, సీరియస్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా ఏ తరహా సినిమాలు అయినా చేయగలిగిన వెంకటేష్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ ఏడాది ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాని వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ఈ నెల 16న అధికారికంగా లాంచ్ కానుంది.
అది కాకుండా తాజాగా వెంకీ మరో క్రేజీ డైరెక్టర్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మలయాళంలో స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసే ఆలోచనలో వెంకీ ఉన్నాడు. జీతూ జోసెఫ్ 2013లో మలయాళ సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ తెలుగు రీమేక్ లో వెంకటేష్ ఇంచాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.

