‘బాబు బంగారం’ ఆడియో లాంచ్‌ : వెంకీ స్పెషల్ ప్లాన్ ఏంటి?
Published on Jul 24, 2016 5:42 pm IST

babu-bangaram
విక్టరీ వెంకటేష్, ‘భలే భలే మగాడివోయ్‌’తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ‘బాబు బంగారం’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. టీజర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో పెద్ద ఎత్తున విడుదల కానుంది. గిబ్రాస్ సమకూర్చిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ని కూడా ఇదే వేడుకలో విడుదల చేయనున్నారు.

దీంతో పాటు ఈ ఆడియో వేడుకకు ప్రత్యేకత తీసుకొచ్చేలా వెంకటేష్ ఓ స్పెషల్ ప్లాన్ కూడా గీశారు. వెంకీ ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు పూర్తైన సందర్భంగా తాను నటించిన సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులను ఈ వేడుకకు ఆహ్వానించారట. ఇక ఈ సందర్భంగానే వారిని ప్రత్యేకంగా సత్కరించేలా వెంకీ ప్లాన్ చేశారట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ వెంకీ టీమ్ ఇప్పటికే పూర్తి చేసేసింది. సాయంత్రం వేడుకలో వెంకటేష్ చేసిన ఈ ప్లాన్ నిజంగానే ఓ స్పెషల్ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. వెంకీ ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook