వెంకీమామ షూటింగ్ అప్డేట్ !

Published on Apr 21, 2019 9:36 pm IST

విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ రెండవ షెడ్యూల్ ఇటవల హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో వెంకీ , చైతూ అలాగే ఇతర తారాగణం ఫై కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే జరుగనుంది. సుమారు 15రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ అలాగే నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ దసరా కు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :