మరొక ఫన్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్ !

మరొక ఫన్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్ !

Published on Jun 29, 2018 9:40 AM IST

venkatest

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, నాగ చైతన్యలతో మల్టీ స్టారర్ చిత్రాల్ని చేస్తున్న ఆయన త్వరలో ఇంకో ఫన్ ఎంటర్టైనర్ ను మొదలుపెట్టబోతున్నారట. ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు ‘నేను లోకల్’ ఫేమ్ వెంకీ త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.

త్రినాథ రావ్ ఇటీవలే వెంకీకి స్క్రిప్ట్ చెప్పగా, అది నచ్చి వెంకీ వెంటనే సినిమాకు ఒప్పుకున్నారట. అంతేగాక ఈ చిత్రంలో ఒక స్పెషల్ రోల్ ఉందని, దాన్ని ఎవరైనా స్టార్ హీరోతో చేయిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి అతిధి పాత్ర చేయబోయే ఆ స్టార్ హీరో ఎవరు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

తాజా వార్తలు