పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్..!

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్..!

Published on Jun 18, 2026 9:59 AM IST

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వెంకీ-అనిల్5’ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు సందడి చేశారు. చిత్ర హీరో వెంకటేష్‌తో పాటు కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కృతి శెట్టి, కీర్తి సురేష్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుండి ప్రారంభం కానుంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు