సాధారణంగా తమిళ చిత్రాలకు ఆ భాషా ప్రాధాన్యత ఉన్న టైటిల్స్‌నే పెడ్తుంటారు. అయితే అవి ఇతర భాషల ప్రేక్షకులకు అర్థమవుతాయా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి విడుదల చేయడం మనం చూస్తుంటాం. కానీ, హీరో సూర్య మరియు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా కోసం మాత్రం చిత్ర బృందం ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. గతంలో ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న టైటిళ్లను పెట్టిన దర్శకుడు, ఈసారి కూడా అన్ని భాషల ప్రేక్షకులకు సులువుగా చేరువయ్యే పేరు కోసం ట్రై చేస్తున్నాడు.
ఈ క్రమంలో అన్ని భాషల వారికి నచ్చేలా ‘విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పేరును తెలుగులో ‘విశ్వనాధం అండ్ సన్స్’గా పిలుచుకుంటే, తమిళంలో ‘విశ్వనాధన్ అండ్ సన్స్’ అని, కన్నడలో ‘విశ్వనాధ అండ్ సన్స్’ అని స్వల్ప మార్పులతో వాడుకోవడానికి వీలుంటుంది. అన్ని ప్రాంతీయ భాషల ప్రేక్షకులకు ఒకే రకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలపై కూడా స్పష్టత రానుంది. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది.


