వెంకీ అట్లూరి దర్శకత్వంలో వెంకీ ?

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వెంకీ ?

Published on Jun 24, 2018 9:38 PM IST


తన మొదటి చిత్రం ‘తొలిప్రేమ’ తో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం యువ హీరో అఖిల్ అక్కినేని తో తన రెండవ సినిమా చేస్తున్నాడు . ఇదిలావుంటే ఈ ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ కి మరో బంపర్ ఆఫర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది . సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం వెంకీ కి వచ్చిందని సమాచారం . గత కొంత కాలంగా సైలెంట్ గా వున్నా వెంకటేష్ ఈ మధ్యన వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు .

దీనిలో భాగంగా ప్రస్తుతం అయన వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అలాగే నాగచైతన్య తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ లలో నటించనున్నారు . ఈ రెండు చిత్ర్రాల తరువాత వెంకీ అట్లూరి తో చేయబోయే చిత్రాన్ని ప్రారంభించనున్నారు. సురేష్ బాబు , మరొక నిర్మాత కలిసి నిర్మించే ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు