సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య లు కలయికలో ‘వెంకీ మామ’ అనే టైటిల్ తో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కాగా ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ, చైతూలు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తుండం అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా అని తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. అలాగే నాగ చైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా నవ్విస్తాయని సమాచారం. ఆగష్టు 8న నుండి రెగ్యూలర్ షూట్ కు వెళ్లనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ చైతు కు జోడి గా నటిస్తుండగా వెంకీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి నటిస్తోంది.
‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


