‘గోపాల గోపాల’లో అర్జున్ నటించడం లేదన్న వెంకీ

‘గోపాల గోపాల’లో అర్జున్ నటించడం లేదన్న వెంకీ

Published on Jun 24, 2014 1:23 PM IST

Venkatesh-with-son

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ మల్టీ స్టారర్ ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం వెంకటేష్ పై వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటాడు.

ఈ సినిమాలో వెంకటేష్ కి ఓ కొడుకు ఉంటాడు. ఆ పాత్రలో వెంకటేష్ అబ్బాయి అర్జున్ నటించనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని వెంకటేష్ తెలిపారు.’గోపాల గోపాల సినిమా లాంచ్ కి అర్జున్ రావడం వల్ల ఈ సినిమాలో అతను ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇందులో అర్జున్ నటించడం లేదు. అప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి వచ్చాడని’ వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు.

వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. కిషోర్ పార్ధసాని(డాలీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు